: భారత ప్రధానమంత్రికి లంక అధ్యక్షుడి కృతజ్ఞతలు
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్సే కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. లంకలో జరుగుతున్న యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపేందుకు ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల మండలి ఓ తీర్మానం చేసింది. దానిపై ఓటు వేయకుండా భారత్ పక్కకు తప్పుకొంది. అందుకు సంతోషం వ్యక్తం చేసిన లంక ప్రతిఫలంగా తమ అదుపులో ఉన్న భారత మత్స్యకారులందరినీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.