: నేను ఎవరి కూతురితోనూ లేచిపోలే: కేజ్రీవాల్ పరుష వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసహనానికి గురయ్యారు. పరుష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం పీఠం నుంచి తొందరపాటుతో వైదొలగిన ఆయన తన చర్యను సమర్థించుకుంటూ... చివరి శ్వాస వరకూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు తానున్నానని, ఎవరి కూతురితోనూ లేచి పోలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయనిలా మాట్లాడారు. 'పాలన నుంచి పారిపోయానని అందరూ అంటున్నారు. నేనెక్కడికీ పోలేదు. ఎవరి కూతురితోనూ లేచిపోలేదు. అలాగే, పాకిస్థాన్ కు కూడా వెళ్లలేదు' అని వ్యంగ్యంగా అన్నారు. అతి తక్కువ సమయంలో ఢిల్లీలో తామందించినట్లుగా స్వతంత్ర భారత దేశంలో మరే పార్టీ కూడా పాలన అందివ్వలేకపోయిందని చెప్పారు.