: కొండా దంపతులు నాకు టికెట్ రాకుండా అడ్డుకుంటారనుకోవడం లేదు: భిక్షపతి
రానున్న ఎన్నికల్లో తనకు పరకాల టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్టు టీఆర్ఎస్ నేత భిక్షపతి తెలిపారు. టీఆర్ఎస్ కు బలమైన బీసీ నేతను తానే అని చెప్పారు. కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారని... తనకు టికెట్ ఇస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. కొండా దంపతులు తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటారని తాను భావించడం లేదని చెప్పారు. సురేఖ రాకతో టీఆర్ఎస్ బలం పెరిగిందని అన్నారు.