: ఒంటి గంట వరకు 53 శాతం పోలింగ్


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53 శాతం పోలింగ్ నమోదయింది.

వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 61 శాతం, చిత్తూరు 55, కడప 60, కర్నూలు 57, తూర్పు గోదావరి 51, గుంటూరు 53, కరీంనగర్‌ 63, ఖమ్మం 49, కృష్ణ 53, విజయనగరం 61, వరంగల్ 50, మహబూబ్‌నగర్‌ 50, మెదక్ 49, ప్రకాశం 55, రంగారెడ్డి 46, నల్లగొండ 55, నిజామాబాద్‌ 52, ఆదిలాబాద్ 47, నెల్లూరు 48, శ్రీకాకుళం 54, విశాఖ 45, పశ్చిమగోదావరి జిల్లాలో 50 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • Loading...

More Telugu News