: దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు: చంద్రబాబు
తాను ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. దేశ, రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని స్పష్టం చేశారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసిందని అన్నారు. అంతులేని అవినీతి వల్ల దేశం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని పాతి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణలో పునర్నిర్మాణం జరగాల్సి ఉందని తెలిపారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణం చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇరు ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని... బీజేపీతో కలసి ఇరు ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.