: ఒత్తిడి ఎక్కువైతే గుండె గుబేలే
అయిన దానికి, కాని దానికి ఆందోళనకు గురవడం, మానసికంగా డిప్రెషన్ కు లోనుకావడం వంటి సమస్యలుంటే గుండెకు చేటేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్య స్థాయి నుంచి తీవ్ర స్థాయిలో డిప్రెషన్ వల్ల గుండె విఫలమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇలాంటి సమస్యలుంటే 40 శాతం గుండె విఫలమయ్యే అవకాశాలు ఉంటాయట. 63వేల మంది నార్వే వాసులపై 11 ఏళ్ల పాటు నిర్వహించిన పరిశోధనలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. డిప్రెషన్ స్థాయి పెరిగినకొద్దీ గుండె విఫలమయ్యే ప్రమాదం కూడా పెరుగుతుందని నార్వేకు చెందిన లెవాంజెర్ హాస్పిటల్ వైద్యుడు లైస్ టుసెట్ గుస్తద్ తెలిపారు.