: 'మర్యాదరామన్న' తమిళ ఆడియోను ఆవిష్కరించనున్న రాజమౌళి
తెలుగులో ఘన విజయం సాధించిన మర్యాదరామన్న చిత్రం తమిళ రీమేక్ ఆడియోను దర్శకుడు రాజమౌళి ఆవిష్కరించనున్నారు. తెలుగులో సునీల్ కథానాయకుడిగా రాజమౌళి మర్యాద రామన్నను తీసిన విషయం తెలిసిందే. ఇది తమిళంలో వల్లవనుకు పుల్లుమ్ ఆయుధం పేరుతో రీమేక్ అవుతోంది. రాజమౌళితోపాటు, మరో ప్రముఖ దర్శకుడు శంకర్ కలసి ఈ సినిమా ఆడియోను ఈ నెల 14న చెన్నైలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శ్రీనాథ్ వెల్లడించారు. సునీల్ పాత్రను తమిళంలో సంతానం పోషిస్తున్నాడు.