: కల్పిత కథ ఆధారంగానే తెనాలిరామన్: నిర్మాణ సంస్థ
తమిళ చిత్రం తెనాలి రామన్ (తెనాలి రాముడు) కల్పిత కథల ఆధారంగా తీస్తున్నదేనని, నిజానికి తెనాలి రాముడి అసలు కథ ఆధారంగా ఇది ఉండదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. తెనాలిరాముడు, శ్రీకృష్ణదేవరాయుడి చారిత్రక పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమాకు వ్యతిరేకంగా పలు తెలుగు సంఘాలు ఇటీవల నిరనన వ్యక్తం చేశాయి. దీంతో నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ ఓ ప్రకటన జారీ చేసింది. తెనాలి రాముడు నీతి కథల ఆధారంగా తామ కల్పించిన కథతో ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేసింది. 15వ శతాబ్దంలో ప్రజల జీవన శైలిని ఈ సినిమా చూపిస్తుందని పేర్కొంది. ఈ సినిమాకు యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహిస్తుండగా, హస్యనటుడు వడివేలు నటిస్తున్నాడు. మూడేళ్ల తర్వాత వడివేలు నటిస్తున్న తొలి చిత్రమిదే.