: చురుగ్గా కొనసాగుతున్న పోలింగ్
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయం 9 గంటలకు 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. 21 గుర్తింపు కార్డులలో దేనినైనా చూపించి ఓటర్లు ఓటు వేయవచ్చని ఆయన సూచించారు. పలు చోట్ల బ్యాలట్ పత్రాలు తారుమారైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇక పోలింగ్ సందర్భంగా పలు అవాంచనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారంలో కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తమకే ఓటు వేయాలంటూ ఓటర్లను బెదిరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్... టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.