: అద్వానీ, రాజ్ నాథ్ ఆస్తుల వెల్లడి


తమ లోక్ సభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆస్తులను వెల్లడించారు. తన ఆస్తుల విలువ ఏడుకోట్ల రూపాయలు ఉంటుందని అద్వానీ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2009లో రూ.3.5 కోట్లు ఉన్న ఆయన ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి.

ఇక తనకు స్థిరచరాస్తులు మొత్తం కలిపి రూ.2.51 కోట్లు ఉన్నట్లు రాజ్ నాథ్ తెలిపారు. ఇందులో ప్రస్తుతం తన వద్ద 65వేల నగదు ఉందని, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో రూ.56 లక్షలు ఉన్నాయని వివరించారు. రూ.4.8 లక్షల విలువ చేసే ఆభరణాలు, ఓ రివాల్వర్ తో పాటు డబుల్ బ్యారెల్ గన్ ఉన్నట్లు చెప్పారు. ఇక రూ.1.4 కోట్ల విలువ చేసే బంగారంతో పాటు రూ.50 లక్షల విలువ చేసే భూమి ఉందని, భార్య సావిత్రి సింగ్ వద్ద రూ.35 వేల నగదు, స్థిరచరాస్తుల రూపంలో రూ.40.68 లక్షల ఉన్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News