: వారిని నేను సముదాయిస్తా: కిషన్ రెడ్డి
టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తూ తెలంగాణ జిల్లాలకు చెందిన 8 జిల్లాల బీజేపీ అధ్యక్షులు రాజీనామాకు సిద్ధపడ్డట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజీనామాలకు సిద్ధపడిన వారితో తాను మాట్లాడతానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. జాతీయ నాయకులతోనూ సంప్రదింపులు జరుపుతానని ఆయన అన్నారు. మరోపక్క, టీడీపీతో పొత్తు కోసం ప్రకాశ్ జవదేకర్ కొనసాగించిన చర్చలు సఫలమయ్యాయి.