: అస్వస్థతకు గురైన ఉమా భారతి
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ ఉమాభారతి అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని ఎన్నికల సభలో పాల్గొంటుండగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన భోపాల్ లోని ఆమె నివాసానికి తరలించారు. ఆమె జ్వరం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాలుగు కిలోమీటర్లు ఊరేగింపుగా నడవడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యారని వారు స్పష్టం చేశారు. దీంతో టికమ్ గఢ్ లోని ఓర్ఛా నగరంలో ఆమె పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దైంది. ఆమె కోలుకున్న వెంటనే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు.