: పెనుకొండ ఎమ్మెల్యే అరెస్ట్, విడుదల
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అనంతపురం జిల్లా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యేతో పాటు ఆరుగురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాటు పూర్తయినట్లు జిల్లా పరిషత సీఈవో విజయేందిర తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక భద్రత కల్పించినట్లు ఆమె చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి... జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేస్తే కఠినంగా శిక్షిస్తామని, కోడ్ ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని విజయేందిర హెచ్చరించారు.