: ఐఐటీ విద్యార్థికి రూ.73లక్షల వేతనంతో ఉద్యోగం


ఐఐటీ రూర్కీ (ఉత్తరాఖండ్) విద్యార్థి ఒకరు అత్యధిక వేతనంతో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఏడాదికి రూ.73లక్షల వేతనంతో ఓ అంతర్జాతీయ సంస్థ భారతీయ ఐఐటీ గ్రాడ్యుయేట్ ను ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది పేర్లు నమోదు చేసుకున్న వారిలో మొత్తం 90 శాతం మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ఉద్యోగాలు లభించాయి. 1,047 మంది ఎంపికయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉద్యోగ ఆఫర్లు ఇచ్చిన వాటిలో ఉన్నాయి. దేశీయ విభాగంలో ఒక కంపెనీ ఆఫర్ చేసిన అత్యధిక వేతనం రూ.32లక్షలుగా ఉందని ఐఐటీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News