: 50 ఏళ్లుగా సాధించలేనిది విభజనతో దక్కింది: కిషోర్ చంద్రదేవ్
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలిపారు. 50 ఏళ్లనుంచి పోరాడుతున్నప్పటికీ సాధించలేనివి... విభజనతో దక్కాయని అన్నారు. కొత్త రాజధాని, జాతీయ యూనివర్శిటీలు, ప్రాజెక్టులు విభజనతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే... సీమాంధ్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.