: ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాను: కేసీఆర్
తాను ముఖ్యమంత్రిని కావాలని కలలు కన్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మనసులోని మాటను వెల్లడించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యమంత్రి కాకూడదా? అని ప్రశ్నించారు. తాను సీఎం కావాలని అనుకున్నానని, అందుకోసం కలలు కంటున్నానని కేసీఆర్ చెప్పారు.