: భద్రకాళీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు
వరంగల్ వాసుల ఇలవేల్పు శ్రీభద్రకాళీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ అమ్మవారికి లిల్లీపూలతో అర్చన నిర్వహించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భద్రకాళి అమ్మవారిని వరంగల్ ఎంపీ రాజయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.