: కిరణ్ పార్టీ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు: పితాని


మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదని మాజీ మంత్రి పితాని సత్యానారాయణ అన్నారు. రాష్ట్ర నిర్మాణం కోసం కృషి చేసే పార్టీ వల్లే ఉపయోగం ఉంటుందని చెప్పారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సమర్థ నాయకుడు చంద్రబాబేనని ఆయన ప్రశంసించారు. తెలుగుజాతికి ద్రోహం చేసినందునే కాంగ్రెస్ ను వీడానన్న పితాని ప్రజల అభీష్ఠం మేరకే టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. మరికాసేపట్లో పితాని తెలుగుదేశంలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News