: ఉత్తరప్రదేశ్ లో సగం స్థానాలు బీజేపీవే!
పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నామంతో దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ పదేళ్ల తర్వాత హవా చూపనుంది. లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కమలం హవా సాగిస్తుందని, హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ పోటీ ఉంటుందని సీఎన్ఎన్-ఐబీఎన్, ద వీక్ సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా యూపీలోని 80 స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అప్నాదళ్ సగానికి పైగా 42-50 స్థానాలు కైవసం చేసుకోనున్నాయని తెలిపింది. మిగతా వాటిలో ఎస్పీకి 11 నుంచి 17, బీఎస్పీకి 10 నుంచి 16 సీట్లు రావొచ్చట. కాంగ్రెస్-ఆర్ఎల్డీ కూటమికి కేవలం నాలుగు నుంచి ఎనిమిది స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని చెప్పింది.
ఇక రాజస్థాన్ లో బీజేపీయే ఆధిక్యంలో ఉండనుంది. 21 నుంచి 25 స్థానాలో విజయం సాధించనుందట. కాంగ్రెస్ కు అదృష్టాన్ని బట్టి 0-2 స్థానాలు మాత్రమే రావొచ్చంటోంది సర్వే. పంజాబ్ లో అకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమికి 42 శాతం ఓట్లు, కాంగ్రెస్-పీపీపీ కూటమికి 29 శాతం ఓట్లు పడొచ్చు. అటు హర్యానాలో బీజేపీ-హెచ్ జేసీ కూటమికి 36 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 30 శాతం ఓట్లు, ఆప్, ఐఎల్ఎల్ డీకి 7శాతం ఓట్లు రావొచ్చు.