: ముషారఫ్ పై బూటు విసిరిన ఆగంతకుడు


పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై గుర్తు తెలియని వ్యక్తి బూటు విసిరాడు. కానీ, అది ముషారఫ్ ను తాకలేదు. వెంటనే భద్రతా అధికారులు ముషారఫ్ ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా నిశ్చేష్ఠులయ్యారు. ముందస్తు బెయిల్ కోసం ఈ రోజు కరాచీలోని సింద్ హైకోర్టుకు హాజరై, బయటకు వస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, కోర్టు ముషారఫ్ బెయిల్ ను 15 రోజుల పాటు పొడిగించింది. 

  • Loading...

More Telugu News