: టైటానియం కుంభకోణంలో వైఎస్ కుటుంబ పాత్ర ఉంది: జేసీ
అమెరికాలో వెలుగుచూసిన టైటానియం కుంభకోణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పాత్ర కూడా ఉందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ అండతోనే ఈ కుంభకోణం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కుంభకోణంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రభావంపై దర్యాప్తు సంస్థలు నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. జగన్ కు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు.