: స్పిన్ Vs పేస్... భారత్, సౌతాఫ్రికా సెమీస్ నేడే
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఈ రోజు టీంఇండియా, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలతో మాంచి జోరుమీదున్న టీంఇండియాను నిలువరించడం సౌతాఫ్రికాకు కత్తి మీద సామే అని చెప్పవచ్చు. భారత బ్యాట్స్ మెన్ అద్భుతమైన ఫాంలో ఉన్నారు. దీనికి తోడు మన స్పిన్ విభాగం కూడా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. అయితే సఫారీల పేస్ విభాగం కూడా పటిష్ఠంగా ఉంది. స్టెయిన్, మోర్కెల్, పార్నెల్ ల పేస్ త్రయాన్ని భారత్ ఏ మేరకు ఆడుకుంటుందన్న దానిపై మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
భారత శిబిరానికి మరో శుభవార్త ఏమిటంటే... ప్రాక్టీస్ లో గాయపడిన యువరాజ్ ఫిట్ నెస్ సాధించాడు. అతను సెమీస్ లో ఆడుతున్నాడని టీంఇండియా వర్గాలు ప్రకటించాయి. నిన్న ప్రాక్టీస్ లో కూడా యువీ పాల్గొన్నాడని టీం మేనేజర్ బాబా తెలిపాడు.