: జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జగన్ ను భరించలేకపోతున్నానని రాజశేఖర రెడ్డి తనతో చాలాసార్లు అన్నారని జేసీ దివాకరరెడ్డి జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో ఆయన మాట్లాడుతూ, మే నెల తర్వాత జగన్ పార్టీ ఉండదని, జగన్ వంటి దురుసు స్వభావి చేతిలో అధికారం పెడితే రాష్ట్రం అధోగతేనని వ్యాఖ్యానించారు.