: ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఇవాళ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) ను విడుదల చేసింది. ప్రధాని నుంచి బంట్రోతు వరకు లోక్ పాల్ పరిధిలోకి తెస్తామని, స్వరాజ్యం సాధించేందుకు రాజకీయ వికేంద్రీకరణ చేస్తామని ఏఏపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. అవినీతి రహిత భారత్ కోసం కృషి చేస్తామని, జన్ లోక్ పాల్ బిల్లును అమలు చేస్తామని ఏఏపీ పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వయసును 25 నుంచి 21కి తగ్గిస్తామని ఏఏపీ మేనిఫెస్టోలో ప్రకటించారు.