: పొన్నాలను కలసిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు
ఆర్టీసీ యూనియన్లలో ఒకటైన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేతలు నేడు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఆయనతో చర్చించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.