: కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్ కు ‘ఫుల్ మసాజ్’


కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్ కు ‘ఫుల్ మసాజ్’ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో స్టోర్ కీపర్ సువర్ణను ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయమై బాధితురాలు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దాంతో బాధితురాలు తన గోడును బంధువులకు చెబుతూ కన్నీరు మున్నీరైంది. దాంతో బాధితురాలి బంధువులు ఆస్పత్రికి వచ్చి వేధింపులకు గురి చేస్తున్న ప్రొఫెసర్ ను నిలదీశారు. అయినా, అతను సరిగ్గా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో కోపోద్రిక్తులైన సువర్ణ తరపు బంధువులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News