: మంద కృష్ణ బెదిరిస్తున్నారు: టీఆర్ఎస్ నేత ఆకుల రాజేందర్
మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తనను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత ఆకుల రాజేందర్ ఆరోపించారు. బెదిరింపులకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఆయన ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని... ఎలా తిరుగుతావో చూస్తామంటూ మంద కృష్ణ హెచ్చరిస్తున్నారని తెలిపారు. మంద కృష్ణ వెనుక కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఉన్నారని ఆరోపించారు. ఈ బెదిరింపులతో తన తల్లి తీవ్ర భయాందోళనలకు గురవుతోందని తెలిపారు.