: తన్ని 20 లక్షలు తీసుకెళ్లిపోయారు
కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి 20 లక్షల రూపాయలు లాక్కుని పారిపోయారు. తాళ్ల రేవుకు చెందిన వెంకటరామ శర్మ అనే వ్యక్తి 20 లక్షల రూపాయలు బ్యాంకులోంచి డ్రా చేసి బ్యాంకు బయటకు రాగా, ఇద్దరు దుండగులు అతని వద్దనున్న బ్యాగు లాక్కుని పారిపోయారు. దుండగుల ఆచూకీ కోసం బ్యాంకులోని సీసీ కెమెరాల సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.