: తొమ్మిది నిమిషాల సీన్ల తొలగింపుకు అంగీకారం
తొమ్మిది నిమిషాల సన్నివేశాల తొలగింపుతో 'విశ్వరూపం' చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసుకోవడానికి ముస్లిం సంఘాలు అంగీకరించాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన 'విశ్వరూపం' విడుదలను రెండు వారాల పాటు తమిళనాడు ప్రభుత్వం నిలిపివేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేర కమల్ సోదరుడు చంద్ర హాసన్ శుక్రవారం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముస్లిం సంఘాలు, ప్రభుత్వాధికారులతో రెండు దఫాలుగా సమావేశం ఏర్పాటు చేశారు.
మొదటి భేటీలో తొమ్మిది నిమిషాల నిడివి ఉన్న అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని ముస్లిం సంఘాలు సూచించాయని చంద్ర హాసన్ తెలిపారు. అయితే బాలీవుడ్ లో 'విశ్వరూపం' విడుదలకు వెళ్లిన కమల్ హాసన్ తిరిగి చెన్నై వచ్చిన తర్వాతే సన్నివేశాల తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంటారని చంద్ర హాసన్ ప్రకటించారు. మరికొద్దిసేపట్లో ముస్లిం సంఘాలతో రెండో దఫా చర్చలు జరగనున్నాయి.