: టీఆర్ఎస్ కలలు కంటోంది: పొన్నాల


తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ టీఆర్ఎస్ కలలు కంటోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని విమర్శించారు. గతంలో దళితుడిని సీఎం చేస్తాం, మైనార్టీని డిప్యూటీ సీఎం చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ అభివృద్ధి జరగదని చెప్పారు.

  • Loading...

More Telugu News