: వరుణ్ గాంధీకి తల్లి మేనకాగాంధీ సలహా
కుమారుడు వరుణ్ గాంధీకి తల్లి మేనకాగాంధీ ఓ సలహా ఇచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, తన సోదరుడైన రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీ అభివృద్ధిపై నిన్న (బుధవారం) వరుణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు స్పందించిన మేనకా.. స్వయంగా చూడకుండా దేనిపైనా వ్యాఖ్యానించవద్దని హితవు పలికింది. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమేనని పేర్కొంది.