: రాహుల్ దరఖాస్తును తిరస్కరించిన అమేథీ అధికారులు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తీవ్ర అవమానం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు స్థానిక సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కు పెట్టుకున్న నివాస ప్రూఫ్ పత్రాన్ని తిరస్కరించారు. అమేథీలో రాహుల్ ఉంటున్నట్లు ఎలాంటి ప్రూఫ్ లేదని, అప్పుడప్పుడు మాత్రమే అక్కడ ఉంటారని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. కాబట్టి, ఎన్నికల సమయంలో వ్యయానికి తప్పకుండా బ్యాంక్ అకౌంట్ ఉండాలని అందుకోసం ఎక్కడ ఉంటున్నారో తెలుపుతూ ఓ సాక్ష్య పత్రం చూపాలన్నారు. గత పది సంవత్సరాల నుంచి అమేథీ నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్న రాహుల్ కు ఈ ఘటన ఓ చేదు అనుభవం.