: ఏపీ ఎక్స్ ప్రెస్ లో మంటలు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఎస్8 బోగీ చక్రాలకు మంటలు అంటుకున్నాయి. భోగీ అంతటా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వెంటనే చైన్ లాగారు. రైలు ఆగడంతోనే ప్రయాణికులు 'బతుకు జీవుడా' అనుకుంటూ పరుగులు తీశారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలును నాగ్ పూర్ స్టేషన్ కు తీసుకెళ్లి దహనమైన బోగీ ఎస్8 స్థానంలో మరొకటి అమర్చిన తర్వాత అధికారులు ఏపీ ఎక్స్ ప్రెస్ ను హైదరాబాద్ కు పంపనున్నారు.