: అజంతా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు
అజంతా ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్టు సమాచారం వచ్చింది. దీంతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో రైలును నిలిపివేశారు. మనోహరాబాద్ లో అజంతా రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైలులో బాంబ్ స్వ్కాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. నెల రోజుల వ్యవధిలో అజంతా ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి.