: తెలంగాణ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు : మోత్కుపల్లి
తెలంగాణ కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వరంగల్ లో జరిగిన ప్రజాగర్జన సదస్సులో మోత్కుపల్లి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఇవ్వాలని లేఖ ఇచ్చింది టీడీపీయేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాని, కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని ఆయన విమర్శించారు.