: అధికారం మాదే: కేసీఆర్


తెలంగాణలో అధికారం తమదేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన వల్ల తెలంగాణ కష్టాల పాలైందని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకున్నవారికి అధికారం ఇస్తే దోపిడీయే జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా తెలంగాణలో టీఆర్ఎస్ దే అధికారమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News