: రాజ్యాంగాన్ని బీజేపీ అవమానించింది: శరద్ పవార్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శల వర్షం కురిపించారు. మోడీని ప్రజలు ఎలా నమ్ముతారని పవార్ ప్రశ్నించారు. గుజరాత్ రాజధానికి సమీపంలో కాంగ్రెస్ ఎంపీని తగలబెడితే కనీసం బాధితుడి కుటుంబ సభ్యులను కూడా మోడీ పరామర్శించలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తి దేశానికి భరోసా ఎలా ఇవ్వగలరని పవార్ ప్రశ్నించారు.

ఇప్పటివరకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించడం ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. ప్రధాని అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించడంతో, రాజ్యాంగాన్ని బీజేపీ అవమానించినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయ్ గఢ్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తత్కరే తరపున పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News