: సౌతాఫ్రికా ఇంటర్ నెట్ లో నల్ల స్మైలీలు


ఇంటర్ నెట్ లో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నవారికైనా స్మైలీలు, ఎమోటికాన్లు అంటే తెలుస్తుంది. సాధారణంగా ఛాట్ లలో వీటిని వినియోగదారులు ఉపయోగిస్తుంటారు. ఇవి మొబైల్ లో కూడా ఉంటాయి. మాటల్లో చెప్పాల్సిన అవసరం లేకుండా, చిన్న చిన్న సింబల్స్ తో భావాల్ని వ్యక్తీకరించడానికి వీటిని వినియోగిస్తుంటారు. ఇలాంటి ఎమోటికాన్లు 800 వరకు ఉన్నాయి. ఈ ఎమోటికాన్లన్నీ శ్వేత జాతీయుల్లాగానే కన్పిస్తాయి.

దీంతో ఆఫ్రికా ఖండంలోని మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారులకు కోపం వచ్చింది. ఎమోటికాన్లన్నీ శ్వేతజాతీయులనే సూచిస్తున్నాయని, నల్లగా ఉంటే బాగుంటుందని, నాలుగు వేల మంది నల్లజాతీయులు ఓ ఆన్ లైన్ పిటిషన్ పెట్టారు. దీంతో ఓజు అనే ఆఫ్రికాకు చెందిన మొబైల్ కంపెనీ 14 భావాలతో నల్ల స్మైలీలను తయారు చేసింది. దీంతో సౌతాఫ్రికాలో నల్ల స్మైలీలు, నల్ల వింకీలు, నల్ల నవ్వులు వాడేసుకుని సంబరపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News