: గద్దర్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకలేదు


ప్రజా గాయకుడు గద్దర్ కు గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. తనపై జరిగిన హత్యాయత్నం కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేసేందుకు ఆయన ఈరోజు రాజ్ భవన్ కు వచ్చారు. అయితే గవర్నర్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయనకు అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. కాగా గద్దర్ పై పదేళ్ల క్రితం హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు.

  • Loading...

More Telugu News