: సీపీఐ మేనిఫెస్టో విడుదల చేసిన నారాయణ


సీపీఐ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తిరుపతిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమకు అనుకూలంగా ఉండే చోట పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా నల్గొండ ఎంపీ స్థానం తమకు కావాలని కోరగా ఖమ్మం స్థానాన్ని కేటాయించారని ఆయన తెలిపారు.

అయితే అక్కడ తాను పోటీ చేయాలా? వద్దా? అనేది ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. జిల్లా నాయకత్వం తన పేరు ప్రతిపాదించినప్పటికీ, కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సీపీఐ ప్రతినిధులు చట్టసభల్లో ఎక్కువ మంది ఉంటే ప్రజావాణి మరింత బలంగా వినిపించవచ్చని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News