: టీడీపీతో పొత్తు ఉంటే ఉంటుంది... లేకపోతే లేదు: జవదేకర్
టీడీపీతో పొత్తును పెళ్లి సంబంధంతో పోల్చారు బీజేపీ జాతీయనేత ప్రకాశ్ జవదేకర్. పెళ్లి సంబంధంలాగానే టీడీపీతో పొత్తు కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదని చెప్పారు. సీట్లపై టీడీపీ స్పష్టమైన నిర్ణయానికి రావాలని అన్నారు. ప్రస్తుతం పొత్తు చర్చలు టీడీపీతో మాత్రమే కొనసాగుతున్నాయని బీజేపీ తెలిపింది. ఈ సాయంత్రం వరకు టీడీపీకి గడువు ఇస్తున్నామని చెప్పింది. జాప్యం చేస్తే ఇరు పార్టీలకు నష్టమని తేల్చిచెప్పింది.