: కాంగ్రెస్ అభ్యర్థులకు కొరత లేదు: రఘువీరా
కాంగ్రెస్ అభ్యర్థులకు కొరత లేదని... శాసనసభకు 1160, పార్లమెంటు కోసం 175 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ జాబితా రెండు విడతలుగా వెలువడుతుందని ఆయన అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన... సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు దక్కుతాయని చెప్పారు.
టీడీపీ మేనిఫెస్టోకు విశ్వసనీయత ఉండదని రఘువీరా అన్నారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు లభించడం అంత సులువు కాదని ఆయన అన్నారు. అభ్యర్థుల ఖరారు కోసం బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాలకు, యువతకు సమ ప్రాధాన్యత ఇస్తామని రఘువీరా చెప్పారు.