: సీఎం కావడానికి తొందరెందుకు? ముందు కేసుల నుంచి జగన్ బయటపడాలి: పవన్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై సెటైర్లు విసిరారు. ఎలాంటి మచ్చ, కేసులు లేని తనకే అన్ని విషయాలు నేర్చుకుని పరిపాలన చేయడానికి సమయం పడుతుందని... అలాంటిది అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ కు పాలన ఎంత కష్టమో ఊహించుకోవచ్చని తెలిపారు. అన్ని కేసుల నుంచి బయట పడి సచ్చీలుడిగా బయటపడ్డ తర్వాతే జగన్ ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించాలని సూచించారు. లక్షల పేజీలు, గదుల నిండా ఉన్న సీబీఐ రికార్డులు... ఇవన్నీ చూస్తుంటే ఆయన క్లీన్ గా కేసుల నుంచి బయటపడతారా? అని తాను కూడా ఓ సామాన్యుడిగా సందేహిస్తున్నానని పవన్ చెప్పారు.

ఏ వ్యక్తి అయినా అత్యంత తక్కువ కాలంలో వందలు, వేల కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తుతారో అనే సందేహం తనకు కూడా ఉందని పవన్ చెప్పారు. ఆదాయం సహజమే కాని... ఉన్నపళంగా పెరగడమనేది సామాన్యమైన విషయం కాదని చెప్పారు. తండ్రి చనిపోతే ఎంత బాధ ఉంటుంది, ఎలాంటి వాతావరణం ఉంటుందనే విషయం తనకు బాగా తెలుసని... అలాంటిది ఓ వైపు తన తండ్రి (వైఎస్) చనిపోతే మరోవైపు సీఎం పదవి కోసం జగన్ నానా తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News