: భారీ నష్టంతో నడుస్తున్న ముంబై మోనోరైల్
దేశంలోనే తొలిసారిగా ఆర్థిక రాజధాని ముంబైలో ప్రవేశపెట్టిన మోనోరైల్ భారీ నష్టాలతో నడుస్తోంది. వాదాలా-చెంబూర్ మధ్యలో వేసిన ఈ రైలును ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ ప్రారంభించారు. మొదట్లో ముంబై ప్రజలు ఈ రైల్ ఎక్కేందుకు ఆసక్తి చూపినప్పటికీ తర్వాత రోజుల్లో ఆదరణ తగ్గిపోయింది. ప్రతిరోజూ టికెట్ల ద్వారా రెండు లక్షలు వస్తోంది. కానీ, మోనోరైల్ ను నడిపేందుకు ముంబై మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎంఎంఆర్ డీఏ)కు ఏడు లక్షల ఖర్చవుతోంది. అంటే రోజుకు ఐదు లక్షలు... నెలకు రూ. 1.5 కోట్ల భారీ నష్టం వస్తోందని ఎంఎంఆర్ డీఏ అధికారి ఒకరు తెలిపారు.