: ఈ సారి ప్రధానికి జంటలేదు
ఈ సారి భారత దేశానికి ఎన్నికయ్యే ప్రధానికి జంటలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ ఇద్దరూ ఒంటరి వారే. మోడీ పెళ్లి చేసుకున్నప్పటికీ దశాబ్దాలుగా సంసారిక జీవితానికి దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అమెరికా, బ్రిటన్ ల మాదిరిగా మన దేశంలో నేతల భార్యలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. గతంలో పీవీ నరసింహారావు, వాజ్ పేయి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. జంటగా అతిధులను ఆహ్వానించే పరిస్థితి ఉండేది కాదు. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురుకానుంది.