: పల్లకీపై ఊరేగిన శ్రీకోదండరాముడు
తిరుమలలో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకీ సేవ ఘనంగా సాగింది. పరిమళ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన కోదండరాముడు పల్లకీలో ఆసీనులై మాడ వీధుల్లో విహరించారు. రామనామస్మరణతో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మంగళ హారతులు సమర్పించారు. భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాలతో పల్లకీసేవ ఆద్యంతం కన్నుల పండువగా జరిగింది.