: నా మనసంతా అక్కడే తిరుగుతోంది: అజారుద్దీన్
సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక పోవడం ఎంతో బాధిస్తోందని మాజీ క్రికెట్ కెప్టెన్, ఎంపీ అజారుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకమాండ్ అనుమతిస్తే హైదరాబాద్ నుంచే పోటీ చేస్తానని నవ్వుతూ చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేయలేదని హైకమాండ్ ను అజార్ వెనకేసుకొచ్చారు. విభజన డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని... విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల మేరకే జరిగిందని స్పష్టం చేశారు. యూపీని కూడా మూడు ముక్కలు చేయాలని... చిన్న రాష్ట్రాల వల్ల పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్ లోని 'టోంక్-సవాయి మాదోపూర్' లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజార్ పోటీ చేస్తున్నారు.