: ఢిల్లీలో తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతల భేటీ
ఢిల్లీలోని నరేష్ గోయల్ నివాసంలో తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై ఓ అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలు ఇంకా తుది దశకు చేరుకోలేదని ఈ రోజు టీ టీడీపీ నేతలు తెలిపారు.