: తండ్రి ఆశయాలకోసమే రాజకీయాల్లోకి వస్తున్నా: బాలకృష్ణ


తన తండ్రి నందమూరి తారకరామారావుగారి ఆశయాలను సాధించడం కోసం తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రెండు, మూడు స్థానాల నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వస్తోందని... చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎక్కడ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ... సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని తెలిపారు. ఈరోజు బాలకృష్ణ సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News