: హైదరాబాద్ లో పోటీ పడనున్న ఎంఐఎం అభ్యర్థులు వీరే


హైదరాబాదులో పోటీ చేయబోయే శాసనసభ అభ్యర్థుల జాబితాను ఎంఐఎం పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఏడుగురు అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసింది. ఎంఐఎం పార్టీ తరపున నాంపల్లిలో మిరాజ్ హుస్సేన్, కార్వాన్ లో కౌసర్ మొహిద్దీన్, చార్మినార్ నుంచి పాషాఖాద్రీ, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, యాకుత్ పురా నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, బహదూర్ పుర నుంచి మోజంఖాన్, మలక్ పేట నుంచి అహ్మద్ బలాల పోటీ చేయనున్నట్టు ఎంఐఎం తెలిపింది. ముస్లిం ఓటర్లు పెద్దఎత్తున ఉండే ఈ ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి పట్టుంది.

  • Loading...

More Telugu News